సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వినతి పత్రాలను స్వీకరించి ఆయా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అనంతరం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు.