డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహనరావు కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా సాలూరు వైటీసీలోని గర్భిణీల వసతి గృహానికి ఫ్యాన్లు, బెడ్ షీట్లు మరియు గర్భిణులకు పండ్లను మంగళవారం అందజేశారు. తన కుమారుడు యువాన్ 6 వ జన్మదిన సందర్భంగా గర్భిణుల సౌకర్యం,ఆరోగ్యం దృష్ట్యా వసతి గృహానికి ఫ్యాన్లు,బెడ్ షీట్లు, గర్భిణులకు పండ్లు,చిన్నారులకు బిస్కట్లు అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో మాట్లాడుతూ ప్రతీ ఏటా తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా మరియు పలు సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సేవా భావంతో చేసే కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయి అని అన్నారు. మనం అందించే ఏ చిన్న సాయమైనా ప్రయోజనం ఉంటుందని, అవకాశం ఉన్న వరకు ప్రతీ ఒక్కరూ సేవా భావం అలవర్చుకోవాలని కోరారు. అనంతరం వసతి గృహ సిబ్బంది, గర్భిణీ మహిళలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ అతని కుమారునికి ఆశీస్సులు తెలియజేసారు. అక్కడ ఉన్న 17 మంది గర్భిణీల ఆరోగ్య స్థితిని పరిశీలించి,అందుతున్న వైద్య సేవలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైటీసీ మేనేజర్ సాగర్,నీడ్ స్వచ్ఛంద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. వేణుగోపాలరావు, సూపర్వైజర్ జయగౌడ్,ఆఫీసు సిబ్బంది వినోద్,వసతిగృహ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.