2019- 2024 శాసనసభ ఐదేళ్ల కాలపరిమితి ముగిసింది. కాలాతీతం కారణంగా 2019లో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై నిమ్మక సింహాచలం వేసిన ఎన్నికల పిటిషన్ హైకోర్టు కొట్టి వేసిందని, ఆమె కొండ దొర ఎస్టీ కులానికి చెందినది కాదని తాను వేసిన రిట్ పిటిషన్ 9574/2022 ఇప్పటికీ పెండింగ్లో ఉందని న్యాయవాది రేగుమహేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఐదేళ్ల కాల పరిమితి ముగిసింది. కాబట్టి ఈ పిటిషన్ విచారణ జరపాల్సిన అవసరం లేదని, ఈ కేసుకు సంబంధించి ఎన్నికల పిటిషన్లు ఏమైనా ఉంటే అవి కూడా రద్దు చేస్తున్నట్లు, ఎలక్షన్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేరా 76, 77 లో స్పష్టంగా చెప్పిందన్నారు. అంతేతప్ప తాను వేసిన పిటిషన్ రద్దు చేయలేదని చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం కొండదొర కులానికి చెందనవారు కాదనడానికి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, వాటిని కోర్టులో సమర్పించి ఆమె ఎస్టీ కాదని నిరూపిస్తామన్నారు.