టిడిపి శాశ్వత సభ్యుడను అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు . ఎచ్చెర్ల మండలం చిలక పాలెంలో జరిగిన తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు, ఐ.టీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు లోకేష్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు మార్గదర్శిగా ఉంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడానికి కృషి చేస్తుంటే, ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము అని ఎంపీ స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. ఈ కార్యక్రమం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బెండు మల్లేశ్వరరావు (మండల పార్టీ అధ్యక్షులు)
గాలి వెంకటరెడ్డి
(రాష్ట్ర బీసీ -సెల్ ప్రధాన కార్యదర్శి ),
అన్నెపు భువనేశ్వర రావు , (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ కార్పోరేషన్ డైరెక్టర్), బళ్లాడ అరుణ రెడ్డి ( విజయనగరం పార్లమెంటరీ ఉపాధ్యక్షురాలు)
బళ్లాడ గోపాల్ రెడ్డి,
మెండ రాజారావు,
ముకలా భాస్కర రావు, చిలక రాము మాజీ సర్పంచ్ చిలక శేఖర్ గారు లచ్చుబోతు అప్పలరాజు, చిలక అప్పలనాయుడు, జరజాపు రామారావు, జరజాపు రాజారావు, మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.