ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని మహిళ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి తొలుత ఆమె వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు అనంతరం కార్మికులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. రోగులకు అందించనున్న మందులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి రత్నకుమారి , వైద్యులు, పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎం చిట్టి, టిడిపి నాయకులు కేతిరెడ్డి చంద్రశేఖర్, జి లక్ష్మణ, అక్యాన అప్పారావు బాల సిబ్బంది పాల్గొన్నారు.