విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట సమీపంలో న్యూ బజరంగీ పేరుతో నిర్వహిస్తున్న రాజస్థానీ దాబాలో పనిచేస్తున్న వ్యక్తి నుంచి 78 గ్రాముల నల్ల మందు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశాం అని రామభద్రపురం ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. కేసుకు సంబంధించి ఎస్సై అందించిన వివరాలు ఇవీ.. రాజస్థాన్ చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లకు నల్లమందును సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించాం అన్నారు. బోటా అనే ప్రాంతం నుంచి ఈ వ్యక్తి నల్లమందును తీసుకు వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎన్ డి పిఎస్ చట్టం ప్రకారం నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసాం. కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ తెలిపారు. పరీక్షల నిమిత్తం నల్లమందును ల్యాబ్ కు పంపించామన్నారు.