చీపురుపల్లి ఆర్ఈసిఎస్ లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం..?

ఫేక్ సర్టిఫికెట్లతో 22 మందికి ఉద్యోగాలు

ఒక్కో పోస్టు పదిలక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఇసిఎస్ లో నకిలీ ద్రోపత్రాలతో 22 మంది ఉద్యోగాలు చేస్తున్నారని  పలువురు నిరుద్యోగులు  ఆరోపిస్తున్నారు.  సోషల్ మీడియాలో నకిలీ ద్రువపత్రాలను  కూడా పోస్ట్ చేస్తున్నారు. గుర్ల మండలానికి చెందిన కన్న అనే వ్యక్తికి నకిలీ ధ్రువపత్రాలు జారీ, ఉద్యోగాలు నియామకం వెనుక హస్తం ఉందని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు చేరేలా అందరూ షేర్ చేయాలని కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న పోస్ట్  వివరాలు ఇలా ఉన్నాయి…

చీపురుపల్లి ఆర్ఇసిఎస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి.. గుర్ల మండలానికి సంబంధించిన  కన్న అనే వ్యక్తి వేరే రాష్ట్రానికి వెళ్లి నకిలీ ధ్రువ పత్రాలు తయారు చేయించుకుని.. ఫేక్ సర్టిఫికెట్లతో కొంతమంది రాజకీయ నాయకుల చొరవతో దాదాపు 10 లక్షల రూపాయలు వరకు చెల్లించి ఆర్ఇసిఎస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది.. అసలు ఆ వ్యక్తివి ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తిపై విజయనగరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన విజిలెన్స్ అధికారులు ఎంక్వయిరీ చేయడం జరిగినది. ఆ ఎంక్వయిరీలో అవి  ఫేక్ సర్టిఫికెట్స్ అని విజిలెన్స్ అధికారులు నిర్ధారించడం జరిగినది.. అప్పుడు ఆ వ్యక్తి  ఫ్రాడ్ చేసిన కారణంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఎఫ్ఐఆర్ జత చేసి కోర్టుకు హాజరు పరచడం జరిగినది.. విజిలెన్స్ అధికారులు ఎలా ఎంక్వయిరీ చేశారంటే ఏదైతే కాలేజీలో చదువుకున్నాను అని ఆ ఫేక్ సర్టిఫికెట్లు చూపించాడో ఆ వ్యక్తి .. పోలీసులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమైనటువంటి ఒకేషనల్ కోర్స్ భారతీయ శిక్ష పరిషత్ అనే కళాశాల అసలు ఫేక్ కాలేజ్ అని ఆ రాష్ట్రం లో క్లోజ్ చేయించడం జరిగినది.. ముఖ్య గమనిక ఏంటంటే ఇదేవిధంగా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి అదే కాలేజీలో దాదాపు 22 మంది  వరకు ఎనర్జీ అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులలో చేరారు. ఒక్కొక్కరు 10 లక్షలు చొప్పున.. ఆర్ ఇ సి ఎస్ ఎండి అయినటువంటి చెల్లించి ఇప్పుడు ఉద్యోగాలు చేయడం జరుగుతుందని ఆరోపించారు.  వాళ్లపైన కూడా త్వరలో విజిలెన్స్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది.. మీకు ఇప్పుడు ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లతో జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయి ఎఫ్ ఐ ఆర్ కాఫీ అనేది మీకు గ్రూపులో పెట్టడం జరుగుతుంది.. ఒక పేద విద్యార్థి 25 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న భవిష్యత్తుని కేవలం 10 లక్షల రూపాయలకి అమ్మేస్తున్నారంటే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఉగ్రవాదులతో సమానం.. ఒక నాటు సారా ఒక గంజాయి అమ్ముకున్నోడికి ఉద్యోగాలు ఇస్తున్నారు గాని ఒక మెరిట్ లో ఉన్న ఏ నిరుద్యోగులు కి కూడా ఈ రోజుల్లో న్యాయం జరగడం లేదు.. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. అతను కూడా ఈ విషయం పైన ఎంక్వైరీ చేయిస్తామని హామీ ఇచ్చారు.. త్వరలోనే నిజ నిజాలు అన్ని కూడా బయట పడతాయి.

ఇది ఆ వ్యక్తి దొంగ సర్టిఫికెట్.. స్వయంగా పోలీసులే నిర్ధారించారు ఇలాగే ఆర్ఇసిఎస్ లో 59 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 22 మంది ఫేక్ సర్టిఫికెట్లతో జాయిన్ అయిన వాళ్లు కూడా ఉన్నారు ఆ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లు కూడా  ఒకటే అని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న నకిలీ ధ్రువపత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *