పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే లో ట్రిప్పరు ఢీకొని
కొటికి పెంట పంచాయతీ, గోగడ వలస గ్రామానికి చెందిన కోట పోలిరాజు (37) మృతి చెందాడు . కూలి పనులు చేసి తిరిగి ఇంటికి వస్తుండగా కుడుమూరు జంక్షన్ వద్ద వెనుక నుంచి వాహనం వచ్చి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పోలిరాజు మృతి చెందినట్లు అతని సోదరుడు లక్ష్మణరావు పాచిపెంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రోడ్డు పనులు నిర్వహిస్తున్న వాహనము పోలిరాజును ఢీ కొట్టి పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే అతను మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కెవి. సురేష్ కుమార్ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.