బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ
సాలూరు పట్టణం 14వ వార్డు బంగారమ్మ కాలనీలో బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుని చిత్రాలను ముగ్గులతో వేసి వాటిపై రంగులు, పూలు జల్లి దీపాలు వెలిగించారు. పిల్లలు పెద్దలు బెలూన్ల తో ఆకాశ దీపాలను వెలిగించారు. దీపారాధన మహోత్సవంలో కాలనీవాసులు వందల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం అన్న సమారాధన నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.