జెండా ఊపి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
విశాఖపట్నంలో జరిగే ప్రధానమంత్రి మోడీ సభకు సాలూరు నియోజకవర్గం నుంచి 20 బస్సులు, 30 కార్లలో కూటమి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి వాహనాలను ప్రారంభించారు. ప్రగతి ప్రధాత మోడీ పర్యటనతో రాష్ట్రంలో మరెంతో అభివృద్ధి జరగడం ఖాయం అని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి దూసుకుపోతోంది అన్నారు. ప్రధాని పర్యటనతో ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడు చూడని, చరిత్రలో నిలిచేలా అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ మండల టిడిపి అధ్యక్షులు చిట్టి, పరమేశు, వేణుగోపాల నాయుడు పాల్గొన్నారు.