దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం అన్నపూర్ణ దేవిగా జ్ఞాన సరస్వతి దేవి భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు, అభిషేకాలు హోమం మానేపల్లి నాగేశ్వరరావు, తులసి దంపతులు, పెదపాటి వెంకట్రావు, (బుజ్జి) సత్యవతి దంపతులు చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.