దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఏకామ్రనాథ సమేత కామాక్షి అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. కోలాట బృందం భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.