ఖరారు చేసిన మంత్రి ఉత్సవ కమిటీ సభ్యులు
గత ఐదేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాలూరు శ్యామలాంబ పండగ వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు పండగను మే 18,19,20 నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేశారు. సాలూరు జమీందారు వంశీయులు యువరాజు విక్రమ్ చంద్ర సన్యాసి రాజు ఆధ్వర్యంలో శ్యామలాంబ ఆలయంలో మంత్రి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, పుర ప్రముఖులు, పెద్దలతో సమావేశం నిర్వహించారు.