చరిత్రలో నిలిచేలా సాలూరు అభివృద్ధి చేద్దాం: మంత్రి సంధ్యారాణి

మండలానికి 20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు

సమన్వయంతో 50 వేల సభ్యత్వ నమోదు చేయాలి

అధికారంలో ఉన్నామనే భ్రమలో దొర మాట్లాడుతున్నారు..

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్
హాజరైన టిడిపి నాయకులు కార్యకర్తలు

సాలూరు చరిత్రలో నిలిచిపోయేలా కూటమి పాలనలో అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె విజయవాడలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశంలో జరిగిన అంశాలను సమావేశంలో తెలియచేసారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారని, మన సాలూరు నియోజకవర్గంలో కూడా నెలరోజుల పాటు జరిగే కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జి ,సాధికార సారథులు అందరూ పాల్గొని విజయవంతంగా 50 వేలు సభ్యత్వాలు నమోదు లక్ష్యం పూర్తి చేయాలని కోరారు. వంద రూపాయల సభ్యత్వం చెల్లించిన వారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షలు, మట్టి ఖర్చులకు పది వేల రూపాయలు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 125 రోజులలో 16,500 డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు మంజూరు చేస్తున్నామని, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని అమరావతి అభివృద్ధికి 160 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ శంకుస్థాపనలు చేశారు. పోలవరం పనులు పూర్తి చేసేందుకు 12,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మంజూరు చేయించిన ఘనత చంద్రబాబుది అన్నారు. ప్రతి మండలానికి ఇప్పటికే నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు కేటాయించాం. మరో 15 కోట్ల రూపాయలు తో ప్రతిపాదనలు చేయించి అభివృద్ధి పనులు జరిపిస్తామన్నారు.

దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు..

దీపావళికి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు.  ఎన్నికలు  ఏవైనా టిడిపి విజయం సాధించాలన్నారు. నీటి సంఘాలు సొసైటీ ఎన్నికల పై టిడిపి నాయకులు కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు.

అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు..

ఇప్పటికే నేనే ఉపముఖ్యమంత్రి అని భ్రమలో  రాజన్నదొర పత్రికా ముఖంగా మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా వున్నాయని, నీతి నిజాయితీ గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దగ్గర క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం, గత ప్రభుత్వంలో ఇసుక దందా, మద్యం కుంభకోణాలు, భూదందాలు చివరికి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం ఉత్తరాలు కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. మీరు మా ప్రభుత్వం, మా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్, టిడిపి నాయకులు ఎం చిట్టి ప్రసాద్ బాబు పరమేశు వెంకటరావు గుల్ల వేణు కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *