108 మహిళలతో మణిద్వీప వర్ణన, కుంకుమ పూజలు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం సాంబశివరావు, రేపాక నాగసాయి ఆధ్వర్యంలో శుక్రవారం మణిద్వీప వర్ణన కుంకుమార్చన పూజలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో వందలాదిమంది భక్తులు పాల్గొని వాసవి మాతను దర్శించుకుని పూజలు అందించారు. కార్యక్రమంలో కోశాధికారి బలభద్రుని శ్రీనివాసరావు ఆర్యవైశ్య యువజన, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.