పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం డబ్బి వీధి రామ మందిరంలో కొలువు తీర్చి విశేష పూజల అనంతరం బుధవారం రాత్రి నిమజ్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బల్ల వేషాలు బాణాసంచా ఆకట్టుకున్నాయి. మంగళ వాయిద్యాలు డీజే సౌండ్ లతో మోతమోగించారు. పట్టణ పరిధిలోని వేలాది మంది భక్తులు ఉత్సవాలను తిలకించారు. ప్రత్యేక బలగాలతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.