పిలుపునిచ్చిన ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు, జేసీఎస్ కన్వీనర్
చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని వైకాపా పట్టణ అధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు జెసిఎస్ కన్వీనర్ గిరి రఘు పిలుపునిచ్చారు. వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడారన్నారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అసత్య ప్రచారం చేశారన్నారు. తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, మీ పరిధిలోని ఆలయాల్లో రేపు పార్టీ శ్రేణులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించాలని అన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్,,వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు,గృహ సారధులు, జే సి ఎస్ కన్వీనర్లు, వైయస్సార్సీపి కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.