రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా మంగళవారం సాలూరు మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అవార్డును అందుకున్నారు. ప్రధాన మంత్రి స్వానిధి రుణాలు మంజూరులో రాష్ట్రంలో సాలూరు మున్సిపాలిటీ రెండో స్థానంలోనిలిచింది. మెప్మా ద్వారా వ్యాపారులకు సకాలంలో రుణాలు అందించిన కమిషనర్, అధికారులు, సిబ్బందిని పురపాలక మంత్రి అభినందించారు. మున్సిపాలిటీకి అవార్డు దక్కడంపై పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కమిషనర్, మెప్మా సిబ్బందికి అభినందనలు తెలిపారు.