ప్రధానమంత్రి స్వానిధి రుణాల మంజూరులో సాలూరు పురపాలిక రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచి, అవార్డు దక్కించుకుంది. స్వయం ఉపాధి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పీఎం స్వానిధి రుణాలు లక్ష్యానికి మించి అందించడంతో సాలూరు మున్సిపాలిటీకి ఈ అవార్డు లభించింది. ఈనెల 29న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అవార్డును స్వీకరించనున్నారు. పీఎం స్వా నిధి రుణాలు మంజూరుకు ఎంతగానో కృషి చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సీఎంఎం పుష్ప, సీవోలను కమిషనర్ అభినందించారు.