దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది చిట్టి, టిడిపి నేతలు పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు అయినప్పటికీ నిగర్వి, నిరాడంబర జీవితం సాగించారన్నారు. నివాళి కార్యక్రమంలో కొనిసి చిన్ని, మజ్జి నటరాజ్, కాళ్ల శ్రీనివాసరావు, గొర్లె తిరుమలరావు, కడవల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.