సంధ్యారాణికి బ్రహ్మరథం పట్టిన బంగారమ్మ కాలనీవాసులు
సాలూరు పట్టణం బంగారమ్మ కాలనీ లో శనివారం కూటమి అభ్యర్థిని సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వార్డులో అడుగు పెట్టిన వెంటనే సంధ్యారాణికి టిడిపి బిజెపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. బోను గంగరాజు, గాడి కోటి, మడక జగన్, చుక్క భూలోక నాయుడు, సత్యనారాయణ, తదితరులతో పాటు 400 మంది టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు భంజ్ దేవ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
ఇంటింటికి వచ్చిన సంధ్యారానికి మహిళలు మంగళహారతులు పట్టి జేజేలు పలికారు. కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు చిట్టి, కేతిరెడ్డి చంద్రశేఖర్, రమణ, నవీన్ కుమార్, శివకృష్ణ, విశ్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ పెద్దింటి శ్రీరాములు పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.