పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు దేవదాయ శాఖ అధికారులు
ఆంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు మంత్రి, కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నిసార్లు విన్నా, మరెన్నో సార్లు ఆ సంబరాన్ని చూసినా, తనివి తీరదని, రెండున్నర శతాబ్దాల పైబడి జరుగుతున్న ఈ జాతర వైశిష్ట్యం గూర్చి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.