పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా సిహెచ్ సత్యన్నారాయణ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్నారు. ఓన్ పే కింద ఆయనకు కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.