ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో పట్టణ సత్యసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు.
సిహెచ్ కార్తికేయ బైపీసీలో 1000 మార్కులకు 979 మార్కులు, కొల్లి శ్రావ్య ఎంపీసీలో 966 మార్కులు తో టౌన్ ఫస్ట్ సాధించారు.
అలాగే ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి లలితా రాణి 470కి 450 మార్కులు, బైపీసీలో ఏ షారోన్ 440 మార్కులకు 425 మార్కులు సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంటర్ సెకండియర్ బైపీసీలో గతంలో ఎన్నడు ఎవరు సాధించనన్ని మార్కులు సాధించిన కార్తికేయను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటిన విద్యార్థులందరికీ కళాశాల యాజమాన్యం అధ్యాపకులు అభినందనలు తెలిపారు.