సాధారణ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో జూన్ 4వ తేదీ వరకు 144 సీఆర్పీసీ సెక్షన్లు అమలులో ఉన్నందున నగరంలో ర్యాలీలు, ఊరేగింపులు, గుంపుగా గుమి కూడటం, ఇతర కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వమని పట్టణ సీఐ వాసు నాయుడు తెలిపారు.
ఎన్నికలకు సంబంధించి, రాజకీయ పార్టీలు, నాయకులు ఏటువంటి ప్రకటనలు మరియు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని సిఐ వాసు నాయుడు తెలియజేశారు.
ప్రజలందరూ సమన్వయం పాటించాలని, అనుమానిత వ్యక్తులు గాని, నేరం జరగడానికి సంబంధించిన సమాచారం గానీ తెలిసిన వెంటనే పోలీసు వారికి సమాచారం తెలియజేయాలని తెలిపారు.