భారీ వర్షంతో పొంగి ప్రవహించిన కాలువలు
సాలూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మురుగు నీటి కాలువలు పొంగి ప్రవహించాయి. శివాజీ కూడలి, పెద మార్కెట్, నాయుడు వీధి, బంగారమ్మ కాలనీ రోడ్డు, దాసరి వీధి, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై నదిలా ప్రవహించింది. వర్షం నిలిచిపోయిన తర్వాత ఆ రోడ్లలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా పాలకులు పట్టించుకోకపోవడంతో మాకీ దుస్థితి తప్పడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.