సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఇంచార్జ్ కమిషనర్ రాఘవాచార్యులకు ఆదేశించారు. పురపాలిక కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పలు విభాగాల్లో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులపై ఆరా తీశారు. గతంలో పన్నుల వసూల్లో ముందంజలో ఉండే పట్టణం పూర్తిగా వెనకపడింది. రెవెన్యూ విభాగంలో అడ్డగోలుగా పలు మ్యుటేషన్లు చేసినట్లు వచ్చిన అవినీతి ఆరోపణలపై బదిలీపై వెళ్లిన ఆర్ ఐ శ్రీనివాసరావుకు సోకాజ్ నోటీస్ జారి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే టౌన్ ప్లానింగ్ లో నిర్వహిస్తున్న దేవి ప్రసాద్ పై వచ్చిన పలు ఆరోపణలపై అతనికి కూడా షోకాజ్ నోటీసు ఇవ్వాలని కమిషనర్ కు కలెక్టర్ సూచించారు.