శ్రీ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారణ జరపాలి
సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నేత శివకృష్ణ
బోరుగడ్డ అనిల్ అరెస్టును స్వాగతిస్తున్నాం. అలాగే శ్రీ రెడ్డిని కూడా అరెస్టు చేస్తే బాగుంటుందని సాలూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శివకృష్ణ అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ..
గత ప్రభుత్వ హయాంలో ఎందరినో బెదిరింపులకు గురిచేసి, సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, చిరంజీవి కుటుంబాన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని చివరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లలను సైతం బోరుగడ్డ నీచంగా తిట్టారన్నారు. మెగా అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, టిడిపి అభిమానుల్ని రెచ్చగొట్టిన అనిల్ ని అరెస్ట్ చేయడం జనసేన పార్టీ స్వాగతిస్తుందన్నారు. అదే సమయంలో అంతకు మించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసి, విచారించి చట్టపరంగా శిక్షించాలని సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు శివకృష్ణ తెలియజేశారు.