మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ
పట్టణ ప్రజలు ఆస్తి, కులాయి పన్నులు చెల్లించి పురపాలక అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చక్కా సత్యనారాయణ కోరారు. పన్నుల చెల్లింపులో సాలూరు మున్సిపాలిటీ బాగా వెనుకబడి ఉందని ఇకపై పన్నుల వసూలు వేగవంతం చేయాలని రెవిన్యూ అధికారులకు ఆయన రెండు రోజుల కిందట ఆదేశించారు. ఈ మేరకు గురువారం 1,30,000 రూపాయలు పన్నులు సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులు వసూలు చేశారని కమిషనర్ తెలిపారు. పుర ప్రజలకు మున్సిపాలిటీ నుంచి అందాల్సిన సేవలు తోపాటు పారిశుధ్యం మెరుగుపరిచి, ప్రజలతో శభాష్ సాలూరు అనిపించుకుంటామన్నారు.