డంపింగ్ యార్డ్ లో తగులబడుతున్న చెత్తను ఫైర్ ఇంజన్ సాయంతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజీవ్ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. చెత్తకు నిప్పంటించడంతో దట్టమైన పొగ, విషవాయువులు వెలువడుతున్నాయని పరిసర ప్రాంత ప్రజలు ప్రయాణికులు రైతులు ఆందోళన చెందారు. మంటలను అదుపులోకి తీసుకొని వచ్చి, పొగ వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ కు మూడు రోజుల క్రిందట వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ అగ్నిమాపక అధికారుల సాయంతో మంటలను ఆర్పారు.