ధర్నా చేసిన కార్మికులు
మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫర్నిచర్ మాయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పురపాలిక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2013లో ప్రత్యేక అధికారి పాలనలో పురపాలిక గెస్ట్ హౌస్ నిర్వహణకు మంచాలు పరుపులు డైనింగ్ టేబుల్ కుర్చీలు ఏర్పాటు చేశారన్నారు. వేలాది రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ కనపడకపోవడంపై తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కార్మిక సంఘ నాయకులు శంకర్, నాయుడు, వెంకట్రావు తదితరులు డిమాండ్ చేశారు. ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రాజీవ్ కు వినతిపత్రం సమర్పించారు.