పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం మూడోవార్డు గుమడాంలో రూ.2.50 లక్షలతో నిర్మించిన సామాజిక మరుగుదొడ్ల భవనాన్ని కొంతమంది వ్యక్తులు యంత్రాలతో సోమవారం కూల్చేశారు. మరమ్మతులకు గురైన సామాజిక మరుగుదొడ్లను ఐదేళ్లుగా పుర ఆధికారులు పట్టించుకోలేదు. ఆరేళ్ల కిందట నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేసినప్పటికీ అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారని గుమడాం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మరుగుదొడ్లు ధ్వంసం చేసిన వ్యక్తులపై మరియు యంత్రాలు సీజ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి, ప్రజాధనాన్ని రాబట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.