కురుపాం నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు సందర్శించిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
మే 13 వ తేది న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు – 2024 సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కురుపాం నియోజకవర్గం,కురుపాం మండలం లోని కిచ్చాడ,కురుపాం గ్రామలలోని పోలింగ్ స్టేషన్లు సందర్శించారు. పోలింగ్ స్టేషన్ల భవనాలను సందర్శించి వాటి యొక్క స్థితి గతులు,మౌలిక వసతులు,విద్యత్,రవాణ,భద్రతపరమైన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకొని తగు సూచనలు,సలహాలు ఇచ్చారు.ఈ పోలింగ్ స్టేషన్లు సందర్శనలో ఎస్పీ తో పాటుగా పాలకొండ డిఎస్పీ జి.వి.కృష్ణారావు,ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ పాల్గోన్నారు.