పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు పట్టణం శ్రీనివాస్ నగర్ కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి (ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదివారం ఉదయం మాస శివరాత్రి (ఉగాది పర్వదినం ను పునస్కరించుకొని) ఉదయం 9 గంటల 20 నిమిషాలకు శ్రీవారికి పంచామృత హరిద్రాచూర్ణాది సుగంధ ద్రవ్యములు, పళ్ళరసములతో విశేషంగా అభిషేక కార్యక్రమం ఆచార్యోత్తములచే నిర్వహించబడినది.
కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభిషేకాలు జరిగే సమయంలో భక్తులు గోవింద నామస్మరణతో హోరెత్తించారు.
ఈ కార్యక్రమమునకు ధర్మకర్త, ధర్మకర్త మండలి సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని (నిజరూపాన్ని) దర్శించి తరించారు.
పలువురు భక్తులు పాలు, పెరుగు, తేనె, మరియు ఇతర పూజాదవ్యములు కైంకర్యమునకు సమర్పించారు.