ఉత్సవాలకు సిద్ధం చేసిన భూనీలా సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం
సాలూరు పట్టణం శ్రీనివాస నగర్ కాలనీలో భూనీల సమీత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి శ్రీవారి ప్రధమ పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం విశ్వక్సేన ఆరాధన తో పూజా కార్యక్రమాలు మొదలై సోమవారం యాగశాల ప్రవేశం, పారాయణాలు, తీర్థ ప్రసాద గోష్టి, హోమం, మంగళవారం ఆదివాస హోమం, పారాయణాలు, నిత్య హోమం బుధవారం మహా పూర్ణాహుతి మంగళ శాసనంతో పవిత్రోత్సవాలను ముగిస్తారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.