రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న జిల్లా దివ్యాంగుల జట్టుకు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్.శోబిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరుపున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం క్రికెట్ కిట్ ను బహుకరించారు. డిసెంబరు 8వ తేది నుండి 12వ తేది వరకు విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న దివ్యాంగుల జట్టుకు ప్రశంసించారు. జిల్లా తరపున క్రికెట్ పోటీలో పాల్గొని క్రికెట్ క్రీడలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, రాష్ట్ర స్థాయి క్రికెట్ క్రీడలో విజేతగా నిలిచి మన జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో నిలపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.తిరుపతిరావు, ఎస్.జి.ఎఫ్ ఎం. మురళీకృష్ణ,
డి.టి. గాంధీ తది తరులు పాల్గొన్నారు..