చంద్రబాబు, పవన్‌పైనా రాళ్లవర్షమేంటి?

అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత

అరకు: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని వపన్‌ కల్యాణ్‌ లపై వరుసగా రాళ్ల దాడి చేస్తున్నా ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపడ్డారు.

అల్లరి మూకల్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ కల్పనలో వైఫల్యం చెందిందన్నారు. నాయకులు, బరిలో ఉన్న అభ్యర్థులకు, ప్రజలకు రక్షణ కల్పించలేని ఏపీ సీఎస్‌, డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ వరుస సంఘటనలపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కూడా తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతా వ్యవహారంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యల్ని సహించకూడదని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *