పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు తుఫాను ప్రభావం
ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా సోమ మంగళ బుధవారాలలో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో మోస్టరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.