వరద బాధితులకు విద్యార్థులు సాయం అందించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి జడ్పీ హైస్కూల్ ఏడో తరగతి విద్యార్థులు 7వేల రూపాయలు విరాళాన్ని సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని కోరుతూ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి అందజేశారు. బాధిత కుటుంబాలను ఆడుకునేందుకు చిన్నారులు పెద్ద మనసుతో సాయమందించడం అభినందనీయమని మంత్రి అన్నారు. చిన్నారుల అందించిన విరాళాన్ని సీఎంకి అందజేస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పాంచాలి సర్పంచ్ యుగంధర్ పాఠశాల హెచ్ఎం ప్రభాకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.