పార్వతిపురం మన్యం జిల్లా
సాలూరు మండలం దండిగాం గ్రామానికి చెందిన యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది.
ఈ కేసు కు సంబంధించి సాలూరు గ్రామీణ ఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాలు ఇవి
సాలూరు మండలం దండిగాం గ్రామానికి చెందిన పార్వతి అలియాస్ జ్యోతి (19) తల్లి మందలించిందని కొన్ని రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది.
తల్లిదండ్రులు బంధువుల ఇంటి వద్దకు వెళ్లి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
అదే గ్రామానికి చెందిన వ్యక్తి కొండ పై వున్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఈ మేరకు తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మా కుమార్తె అని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి యువతి మృతి పై పలు సందేహాలు రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటరమణ తెలిపారు.