శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ
కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మనం వేస్టేజ్ లో ఉండకుండా, శ్రమదాన్‌తో వ్యర్థాన్ని నిర్మూలిద్దాం.
‘భారతదేశం ఎప్పుడూ పచ్చగా ఉండేలా పరిశుభ్రంగా ఉంచుకుందాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంపీడీవో ఆఫీస్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం, రోడ్లు పక్కన ఉన్న చెత్తను శుభ్రం చేశారు. కార్యక్రమంలో రణస్థలం ఎంపీడీవో, అధికారులు, కూటమి నాయకులు, స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ ,విద్యార్థులు పాల్గొన్నారు.