సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి: టౌన్ టిడిపి అధ్యక్షులు చిట్టి

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం పట్టణంలోని 13వ వార్డు బోను వీధి లో  శుక్రవారం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి‌ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ( చిట్టి) మాట్లాడుతూ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని‌ బూత్, క్లస్టర్ ఇన్చార్జిలకు‌ సూచించారు. కొత్త సభ్యత్వాలతో పాటు, రెన్యువల్స్ పై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో బోను గంగరాజు, మద్దిల కృష్ణ,రాపాక నాగరాజు,బోను సత్యనారాయణ, సాయి గణేష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *