27వ వార్డులో టిడిపి సభ్యత్వ నమోదు: పట్టణ అధ్యక్షులు చిట్టి

సాలూరు పట్టణం 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది. చిట్టి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సభ్యత నమోదు పొంది 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని పొందాలని అన్నారు. అధిష్టానం విధించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఇన్చార్జిలకు కోరారు. కార్యక్రమంలో మిగడ శ్రీను రెల్లి కృష్ణ లోకేష్ రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *