సాలూరు పట్టణం నాలుగో వార్డు పెదహరిజన పేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని టౌన్ టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు ( చిట్టి) ఆదివారం పరిశీలించారు. క్లస్టర్, బూత్ ఇన్చార్జిలు సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని చిట్టి అన్నారు. నియోజకవర్గంలో పట్టణాన్ని ముందంజలో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో చింతగడ మోహన్,చింతగడ దాసు, అప్పికొండ శంకర్రావు ,తాలాడ గురుమూర్తి పాల్గొన్నారు.