సాలూరు పట్టణం 18వవార్డు దుగ్గానవీధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టి) హాజరై మాట్లాడారు. సభ్యత్వ నమోదు పై నాయకులు దృష్టి సారించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. మాజీ కౌన్సిలర్ నూతి రాజేశ్వరి,నైన శ్రీనివాసరెడ్డి,చేప సోమేశ్వరరావు,నూతి సాయి, గణేష్ పాల్గొన్నారు.