సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీలైనంతవేగంగా సభ్యత్వ నమోదు పొందాలని ఆయన కోరారు. వంద రూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి రెండేళ్ల వరకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.