విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గోవిందపురం పంచాయతీ రామునిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ముప్పిడి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం పార్లమెంట్ సభ్యులు, ఐ.టీ & కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, మంత్రివర్యులు లోకేష్ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు మార్గదర్శిగా ఉండే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్నదని ఆయన చెప్పారు. “తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడానికి కృషి చేస్తుంటే, ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము,” అని ఆయన స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిందని, ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఎంపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి టీడీపీ మాజీ ఇంచార్జ్ త్రిమూర్తులు రాజు , లావేరు మండలం టిడిపి నాయకులు తోటయ్య దొర , జగ్గం దొర , ఇజ్జి వెంకటేశ్వరరావు , బాబూరావు , తదితరులు పాల్గొన్నారు.