సాలూరు తహసీల్దారు ఎన్ వి. రమణ
భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ ఎన్.వి. రమణ అన్నారు. సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ దాగరవలస, జిఎన్. పెద్దవలస గ్రామాలలో భూసర్వే సమస్యలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు. రైతులను ఉద్దేశించి తహసిల్దార్ మాట్లాడుతూ.. గతంలో 27 గ్రామాలలో భూ రీ సర్వే జరిగిందన్నారు. సర్వేలో లోపాలను సవరించేందుకు రైతుల నుంచి వినతులు స్వీకరిస్తున్నామన్నారు. భూమి కొలతలు, వన్ బి, రైతుల పేర్లు, ఇతర తప్పులను సవరిస్తామన్నారు. దాగరవలసలో 26, జిఎన్. పెద్దవలసలో 36 ఫిర్యాదులు వచ్చాయి. ఈనెల 29వ తేదీ వరకు సదస్సులు నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. అలాగే మరో రెండు గ్రామాల్లో రీ సర్వే జరిగింది. కానీ దానికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. అక్కడ కూడా సమస్యలు ఉంటే రైతులను అడిగి పరిష్కరిస్తామని తహసిల్దార్ తెలిపారు. కార్యక్రమంలో హెచ్.డిటి భాను ప్రసాద్, ఆర్ఐ, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జలయాజమాన్య సంఘ ఎన్నికలకు ఏర్పాట్లు
మండలంలోని జలయాజమాన్య సంఘ ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తహసిల్దార్ ఎన్.వి. రమణ తెలిపారు. మీడియం సాగునీటి ప్రాజెక్టు, పది చెరువులకు సంబంధించి ఆయకట్టు రైతుల వివరాలు నమోదు చేశాం. ఒక్కో చెరువుకు ఆరు టీసీలు చొప్పున మొత్తం 60 టిసిలు, పెద్దగడ్డ ప్రాజెక్టు సంబంధించి 14 టీసీలు సిద్ధం చేస్తున్నామన్నారు.