హీరో, హోండా షోరూంల వద్ద టాటాకు నివాళి అర్పించిన యజమానులు, సిబ్బంది
మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి, వేల కోట్ల రూపాయలు దేశం ప్రజల కోసం వెచ్చించిన గొప్ప దార్శనికుడు రతన్ టాటా అని రవ్వా శ్యామ్ శంకర్, అల్తి సత్యనారాయణ అన్నారు. సాలూరు పట్టణంలోని హీరో, హోండా షోరూంల వద్ద యజమానులు, సిబ్బంది రతన్ టాటా చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. దేశం గొప్ప వ్యాపార దిగజాన్ని కోల్పోయిందని అన్నారు. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఆయనకు నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిది అన్నారు.