కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం దర్శించుకున్నారు. టిటిడి అధికారులు, అర్చకులు మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి నిర్వహిస్తున్న ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. వేద పండితులు మంత్రి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించి ప్రసాదం అందజేశారు.